రోజంతా పని చేసి అలసటతో ఇంటికి తిరిగి వచ్చిన భర్త, వంట చేయకపోవడం చూసి తీవ్ర ఆగ్రహానికి గురై భార్య చెంపపై కొట్టాడు.
దీంతో ఆ భార్య ఇంటి ఒక మూలన కూర్చుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. వంట చేయకపోవడానికి గల కారణాన్ని భర్త కోపంగా అడిగినప్పుడు, తనకు ఒళ్లు బాగుండకపోవడం వల్ల నిద్రపోయానని, అందుకే ఆహారం తయారీ చేయలేకపోయ్యానని ఆ మహిళ చాలా ప్రశాంతంగా చెప్పింది.
తన భర్త కొట్టిన తర్వాత కూడా భార్య కోపపడకుండా మౌనం వహించడం చూసి ఆశ్చర్యపోయిన భర్త, “ఎందుకు ఎదురు మాట్లాడలేదు?” అని అడిగాడు. దానికి ఆ మహిళ, “భర్త కోపంగా ఉన్నప్పుడు ఎదురు మాట్లాడకూడదనేది నా తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం” అని పేర్కొంది. కుటుంబ బంధాలు నిలిచిపోవాలంటే, ఇద్దరూ ఒకరి పరిస్థితిని, భావాలను మరొకరు అర్థం చేసుకోవాలని తెలియజేసే ఈ కథ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

Leave a Reply