“ఉత్కంఠభరిత నిమిషాలు.! కదులుతున్న రైలు కిందకు దూకిన యువకుడు.. చాకచక్యంగా ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్.. గుండెలను పిండేసే వీడియో వైరల్.!!”

ముంబై దాదర్ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై, చర్చ్‌గేట్ వైపు వెళ్లాల్సిన ప్యాసింజర్ లోకల్ రైలు బయలుదేరిన సమయంలో, ఒక యువకుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కదులుతున్న రైలు కిందకు దూకి పడుకున్నాడు.

దీనిని చూసి ఏమాత్రం ఆలస్యం చేయని మహిళా కానిస్టేబుల్ ఏ.ఏ.నార్వడే మరియు ఆమె తోటి పోలీసులు, వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ యువకుడిని అడ్డుకున్నారు.

రైలు కదులుతున్నప్పటికీ ప్రమాదాన్ని లెక్కచేయకుండా, ఆ యువకుడి కాళ్లను పట్టుకుని సురక్షితంగా బయటకు లాగి ఆయన ప్రాణాలను కాపాడారు. మహిళా కానిస్టేబుల్ చూపిన ఈ ధైర్యవంతమైన, వేగవంతమైన చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకుని ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ఏ.ఏ.నార్వడే ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ప్రజలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *