మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సవితా ప్రధాన్ అనే ప్రభుత్వ అధికారి, అక్కడ ఉన్న ఒక ఆసుపత్రికి వెళ్లినప్పుడు, క్యాన్సర్ చివరి దశలో ఉన్న ఒక చిన్నారిని కలసి మాట్లాడారు.
అప్పుడు ఆ చిన్నారి చాలా బాధాకరమైన స్వరం: “మేడమ్, నాకు మీ జుట్టు చాలా నచ్చింది” అని చెప్పింది. చిన్నారి మాటలు విన్న అధికారి సవిత, తన తల్లి కూడా క్యాన్సర్ బారిన పడి కీమోథెరపీ సమయంలో జుట్టు కోల్పోయిన బాధను గుర్తుచేసుకుని వెంటనే చలించిపోయారు.
మహిళలకు జుట్టు ఎంతగానో ఇష్టమైనది అయినప్పటికీ, కొంచెం కూడా ఆలోచించకుండా తన జుట్టును కత్తిరించి, దానిని విగ్గుగా తయారుచేయించి ఆ చిన్నారికి అందించి భావోద్వేగానికి గురిచేశారు. ఒక మహిళ అందం కంటే మానవత్వమే గొప్పదని నిరూపించిన ఆ అధికారి భావోద్వేగ చర్యను తెలుసుకుని, సోషల్ మీడియాలో చాలామంది ఆమెకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రశంసలు తెలియజేస్తున్నారు.

Leave a Reply