మహారాష్ట్ర రాష్ట్రం, పాల్ఘర్ జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో, 8 నెలల ఆడపిల్ల విషయంలో ఏర్పడిన కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి.
ప్రచీ కల్ పేష్ పాటిల్ అనే యువతి, మామ నెట్టివేయడంతో కిందపడి తలకు బలమైన గాయమై మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ప్రచీ తన మామ వల్ల నిరంతరం వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఆమెను పుట్టింటికి తీసుకెళ్లడానికి ఆమె సోదరుడు విశాల్ అనంత్ పాటిల్, విరార్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న నారంగి గ్రామంలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో, 8 నెలల పాప మామ గణపత్ పాటిల్ భుజంపై ఉండగా, పాపను తన వద్దకు తీసుకోవడానికి ప్రయత్నించిన ప్రచీకి, మామకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
వాగ్వాదం ముదిరిన సమయంలో, ఆగ్రహించిన గణపత్ పాటిల్ కోడలిని నెట్టివేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో, ప్రచీ ఇంటి టైల్స్ నేలకు తల తగిలి తీవ్రంగా గాయపడింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక ఆమె మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు నేరుగా వెెళ్లి విచారణ చేపట్టారు.
మరణించిన మహిళ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గణపత్ పాటిల్‌ను అరెస్టు చేశారు. ఆయనపై భారతీయ న్యాయ సంహిత చట్టం కింద సదోషపూరిత నరహత్య, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.

Leave a Reply