ఇటీవల పదవ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి, అమ్మాయి ఇల్లు వదిలి వెళ్లి పెళ్లి చేసుకున్న సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
టినేజ్ వయసులో చదువుపై శ్రద్ధ చూపించాల్సిన సమయంలో, ప్రేమలో పడిన వీరు.. ఈ నిర్ణయం తాము స్వయంగా తీసుకున్నామని, తమకు గానీ లేదా తమ కుటుంబాలకు గానీ ఎలాంటి ముప్పు లేదా బెదిరింపులు రాకూడదని పేర్కొంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. వీడియో చివరిలో ఆ అమ్మాయి అబ్బాయికి సిందూరం పెట్టి, అతని కాళ్లకు నమస్కరించింది.
చిన్న వయసులోనే అవగాహన రాహిత్యంతో తీసుకునే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు, ఆ పిల్లల భవిష్యత్తును పాడు చేయడమే కాకుండా, వారి కుటుంబాలను కోలుకోలేని దుఃఖంలోకి నెట్టివేస్తాయి. చట్టబద్ధంగా వివాహ వయస్సు రాకముందే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవిత దిశను మార్చేస్తాయని ఈ నేటి తరం గ్రహించడం లేదు.
తన కుమార్తె ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకుందన్న వార్త విని, ఆ షాక్‌ను తట్టుకోలేక అమ్మాయి తండ్రికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు తీవ్రమైన చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఈ అనవసరమైన పని వల్ల ఒక కుటుంబ ప్రశాంతత, ఒక తండ్రి ప్రాణం ఈరోజు ప్రశ్నార్థకంగా మారాయి.

Leave a Reply