“వదిలేయండి అంకుల్.. తల్లడిల్లిన 15 ఏళ్ల చిన్నారి.” ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టేసిన గుంపు. దేహశుద్ధి చేసిన జనాలు.. వైరల్ అవుతున్న వీడియో.!!

జార్ఖండ్ రాష్ట్రం చాత్రా జిల్లాలో గత ఆగస్టు 4న గుండెలను పిండేసే దాడి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

15 ఏళ్ల దళిత చిన్నారిని బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణతో, సుమారు 100 నుండి 150 మంది కలిగిన ఆగ్రహించిన గుంపు ఒకటి మహమ్మద్ ఇమ్రోజ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లింది. ఇంటి యజమాని అయిన ఇమ్రోజ్ తండ్రిని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి, చెట్టుకు కట్టేసి ఆ గుంపు దారుణంగా కొట్టింది.

తన తండ్రిని కాపాడుకోవడానికి పరుగెత్తుకొచ్చిన ఇమ్రోజ్‌ను ఆ పెద్ద గుంపు కర్రలు, రాళ్లతో దారుణంగా బాదింది. ఇందులో తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స ఫలించక పరితాపకరంగా మృతి చెందాడు. చిన్నారి అపహరణ, లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు ఇంకా వెలువడని నేపథ్యంలో, ఈ హింసాత్మక సంఘటనతో సంబంధం ఉన్న 10 మందిని అప్రమత్తమైన పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *