ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా రసూర్ బాద్ ప్రాంతంలోని నెహ్రూ నగర్లో, తన ఇంటి బయట ఆడుకుంటున్న ఒక చిన్న పాపపైకి హఠాత్తుగా కారు దూసుకొచ్చి తీవ్రంగా గాయపరిచింది.
ఆ వీధిలోకి మలుపు తిరిగిన ఒక కారు, ఊహించని విధంగా ఆ చిన్నారిపైకి ఎక్కి దిగింది. అరుపులు, కేకలు విని పరుగెత్తుకొచ్చిన పొరుగువారు, కుటుంబసభ్యులు కారు కింద చిక్కుకున్న చిన్నారిని రక్షించి, వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు.
మొదట సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం కాన్పూర్లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ గురించిన సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు, ఈ సంఘటనపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply