తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో నడుస్తున్న ఒక ప్రముఖ నగల దుకాణంలో ఐదుగురు సభ్యుల ముఠా తెగింపుతో కూడిన దొంగతనానికి పాల్పడింది.
ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మరియు ఒక బాలుడు ఉన్న ఈ చిన్న ముఠా, నగలు కొనడానికి వచ్చిన కస్టమర్లలా షాప్‌లోకి ప్రవేశించారు. సిబ్బంది దృష్టిని తంత్రంగా మళ్లించి, అక్కడ ఉన్న 10 గ్రాముల బరువున్న బంగారు గొలుసును తెలివిగా నొక్కేసి, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుండి జారుకున్నారు.
నగ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయిన షాప్ యజమాని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఆ ముఠా చేతివాటం అట్టహాసంగా బయటపడింది. ఈ సంఘటనపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాల సహాయంతో పరారైన మహిళల ముఠాతో సహా 5 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply