ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా ప్రజలు ఉపయోగిస్తున్న గూగుల్ క్రోమ్ (Google Chrome) బ్రౌజర్లో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి.
వినియోగదారులను మోసం చేసి, నకిలీ వెబ్సైట్ల ద్వారా వారి కంప్యూటర్లలో ప్రమాదకరమైన యాప్‌లను ఇన్స్టాల్ చేయించి, వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిస్తున్నట్లు తేలింది.
ఇటీవల గూగుల్ సంస్థ తన క్రోమ్ బ్రౌజర్లో ఉన్న పలు సెక్యూరిటీ లోపాలను గుర్తించింది. వినియోగదారుల బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు, వెంటనే ఈ లోపాలను సరిచేసే కొత్త సెక్యూరిటీ అప్డేట్ను గూగుల్ విడుదల చేసింది.
కాబట్టి విండోస్, మ్యాక్ మరియు లైనక్స్ కంప్యూటర్ వినియోగదారులంతా తమ గూగుల్ క్రోమ్‌ను తక్షణమే లేటెస్ట్ వర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలని గూగుల్ మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేయడానికి, క్రోమ్ పేజీకి కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై (Three Dots) క్లిక్ చేయాలి. అందులో ‘Help’ విభాగానికి వెళ్లి, ‘About Google Chrome’ ని ఎంచుకోవాలి.
ఇలా చేయగానే గూగుల్ క్రోమ్ స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) కొత్త అప్డేట్ను తనిఖీ చేసి డౌన్లోడ్ చేసుకుంటుంది. దీని ద్వారా హ్యాకర్ల దాడుల నుండి మీ కంప్యూటర్ను, సైబర్ మోసాల నుండి మీ ఆర్థిక వివరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Leave a Reply