“అయ్యో నన్ను వదిలేయండి ప్లీజ్”. కన్నీళ్లతో వేడుకున్న 8 ఏళ్ల చిన్నారి. ఊరంతా కలిసి వెతికిన మృగం.. ఎలా దొరికాడంటే?. మధ్యప్రదేశ్ లో సంచలనం.!

మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగ్‌పూర్ జిల్లా, గోటెగావ్ ప్రాంతంలో 8 ఏళ్ల చిన్నారిని మోసపూరితంగా అపహరించి, లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు.

గత ఆగస్టు 5న, పాఠశాలలో ఉన్న చిన్నారి వద్దకు ఆమె తండ్రి రమ్మంటున్నాడని చెప్పి పొరుగు ఇంట్లో నివసించే అనిల్ యాదవ్ అనే యువకుడు తీసుకెళ్లాడు. అడవిలోకి తీసుకెళ్లి ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగడుతున్న సమయంలో పాప గట్టిగా కేకలు వేయడంతో, ఎక్కడ దొరికిపోతానోననే భయంతో ఆమె గొంతు నులిమి చంపేసి, మృతదేహాన్ని నీళ్లతో నిండిన ఒక గోతిలో పడేశాడు.

పాప ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నర్సింగ్‌పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నేతృత్వంలో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలతో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 8 గంటల శ్రమ అనంతరం అడవి నుండి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరానికి పాల్పడిన అనిల్ యాదవ్, తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామస్థులతో కలిసి చిన్నారిని వెతుకుతున్నట్లు నాటకమాడాడు. అయితే, సాక్షుల వాంగ్మూలాలు మరియు సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు తన నేరాన్ని అంగీకరించాడు.

ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర అగ్రహావేశాలను రేకెత్తించింది. నిందితుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు దుకాణాలు మూసివేసి (బంద్), క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ నిరసనలు చేపట్టారు. పోలీసులు అనిల్ యాదవ్‌పై పోక్సో (POCSO) చట్టం మరియు హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘోర నేరానికి గాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *