బెంగళూరులో నివసిస్తున్న 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఏడాదికి దాదాపు రూ.70 లక్షల ఆదాయం గడిస్తున్న ఆయన, ప్రస్తుతం 1.5 BHK ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. దీని కోసం నెలకు రూ.44,000 అద్దెగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం అద్దె చెల్లించడానికి బదులుగా, తాను నివసిస్తున్న ఫ్లాట్‌నే కొనుగోలు చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.
ఆయన నివసిస్తున్న ఫ్లాట్ ధర దాదాపు రూ.1.1 కోటి నుండి రూ.1.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ప్రతి నెలా రూ.44,000 అద్దె చెల్లిస్తూ ఉండాలా లేదా ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టి సొంత ఇల్లు కొనాలా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆయన నెటిజన్ల సలహా కోరారు. దీంతో ఇల్లు కొనడం మరియు అద్దెకు ఉండటం అనే ఈ రెండింటిలోని లాభనష్టాలను (అనుకూల, ప్రతికూలాంశాలను) విశ్లేషిస్తూ చాలామంది చర్చించడం ప్రారంభించారు.
బెంగళూరు లాంటి నగరాల్లో ఇంటి ధరలు, అద్దెలు రెండూ ఎక్కువగా ఉండటంతో సొంత ఇల్లు కొనాలా లేక అద్దెకే కొనసాగాలా అనేది చాలామందికి కీలకమైన ఆర్థిక నిర్ణయంగా మారుతోంది. ముఖ్యంగా ఒకే ఇంట్లో సుదీర్ఘకాలం నివసించాలని ప్లాన్ చేసుకునేవారు ఇల్లు కొనడం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో భారీ మొత్తాన్ని ఇళ్లలో పెట్టుబడి పెట్టడానికి ముందు హోమ్ లోన్, వడ్డీ, నిర్వహణ (మెయింటెనెన్స్) ఖర్చులు వంటి వివిధ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ యవ ఇంజనీర్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో చాలామంది దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఆ యువకుడు ఏ నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ నెలకు రూ.44,000 అద్దె చెల్లించడం మరియు రూ.1.1 కోటి నుండి రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయడం అనే రెండు అవకాశాల మధ్య వ్యత్యాసంపై ఆయన చేసిన పోస్ట్ చాలామందిని ఆలోచింపజేసింది. అధిక ఆదాయం ఉన్నప్పటికీ ఇల్లు కొనడం లాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు ప్రణాళికలను, ఖర్చులను జాగ్రత్తగా సమీక్షించుకోవాలనే విషయాన్ని ఈ చర్చ స్పష్టం చేస్తోంది.

Leave a Reply