“రేయ్.. మచ్చా స్టైల్‌గా వీడియో తీయరా. మద్యం మత్తులో నడిరోడ్డుపై ప్రాణాలమీదికి తెచ్చే విన్యాసాలు. బీరు బాటిళ్లతో దూసుకెళ్లిన కారు. భయాందోళనకు గురిచేసిన యువకులు దొరికింది ఎలా?. పుణేలో కలకలం.!”

పుణే నగరంలో మద్యం మత్తులో కారులో వేగంగా వెళ్లిన యువకుల ముఠా ఒకటి, ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడుతూ వీధుల్లో హంగామా సృష్టించింది.

కారు నాలుగు కిటికీల తలుపులను తెరచి ఉంచి, చేతుల్లో బీరు బాటిళ్లతో వెళ్తూ, నడుము పైభాగం వరకు బయటకు వచ్చి ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఇది వారి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర ప్రమాదకరంగా మారింది.

ఆ యువకులు లా కాలేజీ ప్రాంతం నుండి సేనాపతి బాపట్ రోడ్డు మీదుగా నల్ స్టాప్ మరియు డెక్కన్ ప్రాంతాల వైపు కారులో వెళ్తూ మార్గమధ్యంలో కేకలు వేస్తూ రగడ చేశారు. ఈ ప్రమాదకర విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వ్యాపించి వైరల్ కావడంతో, పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు.

వీడియో ఆధారంగా వెంటనే స్పందించిన డెక్కన్ పోలీసులు, సంబంధిత వాహనాన్ని కనుగొని దానిలోని నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేయగా, ఈ ఘటనపై పోలీసులు మరింత తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *