ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా వేలుగోడు మండలానికి చెందిన అనుష (22) అనే మహిళకు చెన్నయ్య అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
ఈ క్రమంలో, అదే ప్రాంతానికి చెందిన రాము అనే వ్యక్తితో అనుషకు కొంతకాలంగా అక్రమ సంబంధం నడుస్తోంది. అయితే, కొద్దిరోజుల కిందట వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి తీవ్రంగా గొడవపడ్డారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాము, “ఒంటరిగా మాట్లాడాలి” అని చెప్పి అనుషను ఊరి చివర ఉన్న విజన్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకోగానే, తను వేసుకున్న ప్లాన్ ప్రకారం అనుషపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడైన రాముతో పాటు ఈ దారుణ హత్యకు సహకరించిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.

Leave a Reply