“ప్రాణాల మీద ఏమైనా ఆశ ఉందా నీకు?!” రోడ్డుపై వెళ్లేవాళ్లను భయభ్రాంతులకు గురిచేసిన డ్రైవర్… రన్నింగ్ లారీ పైకప్పుపై ఎక్కి మాస్ డాన్స్! వైరల్ వీడియో!

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ పైకప్పు ఎక్కి డ్రైవర్ డాన్స్ చేసిన అత్యంత ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపింది.

లారీ డ్రైవింగ్ సీటులో ఎవరూ లేకుండా రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్ డోర్ తెరిచి పైకప్పు మీదికి ఎక్కాడు. వాహనం వేగంగా వెళ్తుండగా టాప్ పై నిలబడి విన్యాసాలు చేస్తూ స్టెప్పులేశాడు.

రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికుల ప్రాణాలను గాల్లో దీపంలా మారుస్తూ, తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి చేసిన ఈ పిచ్చి పని నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ పిచ్చితో ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది.

స్టీరింగ్ పట్టుకోవడానికి డ్రైవర్ లేకుండా లారీ దానంతట అదే వెళ్తున్న సమయంలో చేసిన ఈ పైత్యపు పని వల్ల ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది. పక్కనే వెళ్తున్న ఇతర వాహనదారులు ఈ దిగ్భ్రాంతికర దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, రోడ్డు భద్రతను గాలికొదిలేసిన ఇలాంటి బాధ్యతారాహిత్య డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా సదరు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *