కఠిన శ్రమ, పట్టుదలతో డాక్టర్ చదువు పూర్తిచేసి.. అనూహ్యమైన మలుపుతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఐశ్వర్య లక్ష్మి సినీ ప్రయాణం ఎంతో మందికి ఒక గొప్ప స్ఫూర్తిదాయక కథ.
ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి డాక్టర్‌గా పట్టా అందుకున్న ఆమె, ప్రారంభంలో సినిమాల్లో నటించాలని గానీ లేదా సినీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని గానీ అస్సలు అనుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులు సమాజంలో మంచి గుర్తింపు ఉండే డాక్టర్ వృత్తిలోనే స్థిరపడాలని కోరుకున్నారు. అయితే కాలేజీ రోజుల్లోనే సరదాగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.
చదువుకుంటూనే మోడలింగ్ చేస్తున్న సమయంలో.. 2017లో నివిన్ పౌలీ హీరోగా వచ్చిన ‘ంజండుకలుడే నాటిల్ ఒరిడవేళ’ అనే మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆషిక్ అబు దర్శకత్వంలో వచ్చిన ‘మాయానది’ సినిమా ఆమెలోని అద్భుతమైన నటిని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా, ఉత్తమ నటిగా విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించాలనే ఆలోచన ఒకవైపు ఉన్నప్పటికీ, దేవుడు రాసిన రాత ఆమెను వెండితెరపై తిరుగులేని నటిగా నిలబెట్టింది.
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ‘యాక్షన్’ సినిమాతో కోలీవుడ్‌లో, అటుపై మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో ‘పూంగుళలి’ పాత్రతో పాన్-ఇండియా స్థాయిలో అభిమానుల మనసులను గెలుచుకున్నారు. అంతేకాకుండా సత్యదేవ్ సరసన ‘గాడ్సే’ సినిమాతో పాటు ‘మట్టి కుస్తీ’, ‘గార్గి’ వంటి చిత్రాల్లో బలమైన కంటెంట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తానొక ప్రతిభావంతురాలైన నటి అని నిరూపించుకుంటున్నారు.
“ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసినా ప్రాక్టీస్ చేసే అవకాశం రాలేదు, యాక్టింగ్‌లోకి రావడం పూర్తిగా అనుకోకుండా జరిగింది” అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చినప్పటికీ.. డాక్టర్ నుంచి స్టార్ హీరోయిన్గా మారిన ఆమె ప్రయాణం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది.

Leave a Reply