“అర్ధరాత్రి వేళ!” మద్యం సీసాలు, చిప్స్ ప్యాకెట్లతో స్నేహితుడి గదిలోకి వెళ్లిన యువతి శవమై తేలిన ఘోరం… నిందితుడు అరెస్ట్! అసలేం జరిగింది?!

నోయిడాలో జరిగిన ఒక యువతి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు బీహార్‌లో మద్యం బాటిళ్లతో పట్టుబడి పోలీసులకు చిక్కిన ఉదంతం క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

నోయిడాలోని బరోలా ప్రాంతంలో నివాసముంటున్న అసోంకు చెందిన మెహక్ అహ్మద్ అనే యువతి, అదే ఫ్లోర్‌లో ఉంటున్న తన స్నేహితుడు రమన్ రాజ్‌తో కలిసి అర్ధరాత్రి మద్యం బాటిళ్లు, స్నాక్స్‌తో అతడి గదిలోకి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం రమన్ రూమ్ బయట తాళం వేసి ఉండటంతో, అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా మెహక్ రక్తపు మడుగులో శవమై కనిపించింది.

హత్య అనంతరం నోయిడా నుంచి పరారైన రమన్ రాజ్‌ను పోలీసులు గాలిస్తుండగా.. బీహార్‌లోని కతిహార్‌లో మద్యం నిషేధం ఉన్న ప్రాంతంలో 5 లిక్కర్ బాటిళ్లతో తిరుగుతూ స్థానిక పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నోయిడా మర్డర్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు ఇతనేనని తేలడంతో నోయిడా పోలీసులు వెంటనే కతిహార్‌కు చేరుకున్నారు.

ప్రస్తుతం నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై నోయిడాకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి మద్యం పార్టీ తర్వాత వారి మధ్య ఎలాంటి వివాదం జరిగింది? హత్యకు దారితీసిన అసలు కారణాలేంటి? అనే విషయాలు సమగ్ర విచారణ తర్వాతే బయటపడనున్నాయి.


Posted

in

by

Tags: