“కేవలం ఫొటోల కోసమే నన్ను పిలిచారా?!” స్వాతంత్ర్య వేడుకల్లో మైక్ పట్టుకుని విరుచుకుపడ్డ కపిల్ దేవ్… నిర్వాహకులకు దిమ్మతిరిగే క్లాస్! నెట్టింట వైరల్ వీడియో!

ఒక పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. అక్కడ సరైన క్రమశిక్షణ, ప్రణాళిక లేకపోవడంపై వేదికపైనే నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో మైక్ అందుకున్న కపిల్ దేవ్.. పాఠశాలలో కనీస క్రమశిక్షణ పాటించకపోవడంపై మండిపడ్డారు. సమాజాన్ని తీర్చిదిద్దే గురువులకు సముచిత గౌరవం ఇవ్వకపోవడంపై నిర్వాహకులను నిలదీశారు.

“నన్ను కేవలం ఫొటోలు దిగడానికే పిలిచి ఉంటే ఆ విషయం ముందే చెప్పాల్సింది, దానికోసమే ప్రత్యేకంగా సమయం కేటాయించి వచ్చేవాడిని” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో క్రమశిక్షణతో పాటు ఉపాధ్యాయులను గౌరవించడం నేర్పించాలంటూ కపిల్ దేవ్ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.


Posted

in

by

Tags: