“నా మూడ్ మొత్తం పాడుచేశావ్!” హనీమూన్‌లో భార్యకు పీరియడ్స్… గొంతు నులిమి చంపబోయిన భర్త! హోటల్‌లో షాకింగ్ ఘటన!

అండమాన్ నికోబార్ దీవులకు హనీమూన్‌కు వెళ్లిన సమయంలో తనకు పీరియడ్స్ (రుతుక్రమం) వచ్చాయన్న కోపంతో భర్త తనపై దాడి చేసి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వివాహిత పోలీసులకు సంచలన ఫిర్యాదు చేసింది.

ఢిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో 2023లో ఆమెకు వివాహం కాగా, అదనపు కట్నం కోసం అత్తింటివారు ఆమెను తీవ్రంగా వేధించేవారు. ఈ క్రమంలో హనీమూన్ కోసం అండమాన్ వెళ్లిన సమయంలో ఆ యువతికి పీరియడ్స్ వచ్చి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. “నా మూడ్ మొత్తం పాడుచేశావు” అంటూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు పిసికి చంపేందుకు యత్నించాడు. ఆమె కేకలు విన్న హోటల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కాపాడారు.

పెళ్లి సమయంలో రూ. 20 లక్షల నగదు, కారు మరియు రూ. 40 లక్షల విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చినప్పటికీ ఢిల్లీలోని అత్త, ఆడపడుచులు మరింత కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోరఖ్‌పూర్ ఎస్ఎస్పీ జోక్యంతో భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: