ముంబైకి చెందిన టెలివిజన్ మరియు వెబ్ సిరీస్ నటి అంతరా బెనర్జీ, ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో సూరత్ వెళ్తున్నారు.
ఏసీ కోచ్ టికెట్ దొరకకపోవడంతో, స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే ఆమె ఏసీ బోగీలో కూర్చున్నారు. ఆ సీటుకు అసలైన రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడు కోరినప్పటికీ ఆమె సీటు ఖాళీ చేయడానికి నిరాకరించడంతో, టికెట్ కలెక్టర్ (TTE) మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది అక్కడికి వచ్చి ఆమెను విచారించారు.
ఆ సమయంలో అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన నటి, అకస్మాత్తుగా తన బట్టలు విప్పి వీరంగం సృష్టించడమే కాకుండా, తన వద్ద ఉన్న బ్లేడ్‌తో టీటీఈ మరియు భద్రతా సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. అంతేకాకుండా, పారిపోయే ప్రయత్నంలో రైలు కిటికీ అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. దీనితో దహను రైల్వే స్టేషన్లో ఆమెను అడ్డగించి పట్టుకున్న పోలీసులు, విధులకు ఆటంకం కలిపించడం మరియు దాడి చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె కోర్టు బెయిైల్పై విడుదలయ్యారు.
