రాజస్థాన్ రాష్ట్రంలోని బారన్ నగర పరిధిలోని SKG ఫ్యాక్టరీ సమీపంలో, పుట్టి కేవలం 2 గంటలైన ఒక మగ పసికందును కన్నతల్లే నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పడేసి వెళ్లిన దారుణం వెలుగుచూసింది.
ఆ మార్గంలో వెళ్తున్న ఒక లారీ డ్రైవర్, గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పసికందును గమనించి వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు.
దత్తత తీసుకుంటామంటూ వచ్చిన దంపతులు:
ఆ పసికందు ఆసుపత్రిలో చేరిన వార్త బయటకు వ్యాపించడంతో, ఆ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటామంటూ పలు కుటుంబాలు ఆసుపత్రి వద్దకు పరుగులు తీశాయి. ముఖ్యంగా 12 ఏళ్లుగా పిల్లలు లేక తల్లడిల్లుతున్న ఒక దంపతులు, ఆ పసికందును చూడగానే భావోద్వేగంతో కన్నీరుమున్నీరై తాము దత్తత తీసుకుంటామని వేడుకున్నారు.
ప్రస్తుతం ఆ చిన్నారి శిశు సంక్షేమ కమిటీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సంరక్షణలో క్షేమంగా ఉన్నాడు. పసిగుడ్డును నడిరోడ్డుపై పడేసి వెళ్లిన ఆ నిర్ధయ కన్నతల్లి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
