“ముఖమంతా స్టేప్లర్ పిన్నులే!” మోటోరోలా ఫోన్ పేలి చెల్లాచెదురవడంతో విలవిల్లాడిన యువకుడు.. అలీగఢ్‌లో జరిగిన ఘోర ప్రమాదంతో హడలిపోయిన జనం..!!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్‌లో ఓ డెలివరీ బాయ్ చొక్కా జేబులో ఉన్న మొబైల్ ఫోన్ హఠాత్తుగా పేలిపోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనలో అతనికి చికిత్స చేసే సమయంలో ముఖానికి కుట్లకు బదులుగా సర్జికల్ స్టేప్లర్ పిన్నులు వేయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అలీగఢ్ జిల్లా అత్రౌలీ ప్రాంతానికి చెందిన సచిన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఆగస్టు 15 సాయంత్రం రామ్‌ఘాట్ రోడ్డులో వెళ్తుండగా, చొక్కా జేబులో ఉంచుకున్న మోటోరోలా ఫోన్ ఊహించని విధంగా ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. మొబైల్ పేలిన తీవ్రతకు దుస్తులకు కూడా మంటలు అంటుకోవడంతో, ఒళ్లంతా తీవ్ర గాయాలతో సచిన్ నొప్పితో రోదిస్తూ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, గాయపడిన సచిన్‌ను రక్షించి అత్రౌలీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (CHC) తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్న క్రమంలో, ముఖంపై తగిలిన గాయాలకు సాధారణ సర్జికల్ కుట్లు వేయడానికి బదులుగా స్టేప్లర్ పిన్నులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంటికి చేరుకున్న సచిన్, తీవ్ర గాయాలు మరియు భయంతో ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ముఖం, చేతులపై లోతైన కాలిన గాయాలు తీవ్రంగానే ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీ మొబైల్ ఫోన్ ఇలా పేలిపోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.


Posted

in

by

Tags: