ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UP T20 League) ప్రాక్టీస్ సెషన్‌లో భారత డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్, పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ విచిత్రమైన బౌలింగ్ శైలిని అనుకరిస్తూ నవ్వులు పూయించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాబోయే యూపీ టీ20 లీగ్ మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎప్పుడూ సరదాగా ఉండే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రింకూ సింగ్.. తన వింతైన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైన పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ శైలిని అచ్చుగుద్దినట్లు దించి చూపించాడు. ప్రాక్టీస్‌లోని తీవ్రమైన వాతావరణాన్ని తేలికపరిచేందుకు రింకూ చేసిన ఈ సరదా చేష్ట అక్కడున్న సహచర ఆటగాళ్లను కడుపుబ్బా నవ్వించింది. మ్యాచ్ ఒత్తిళ్ల నడుమ రింకూ చేసిన ఈ ఫన్నీ మిమిక్రీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.
ఈ సందడి తర్వాత రింకూ సింగ్ మళ్లీ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. త్వరలో ప్రారంభం కానున్న టీ20 లీగ్‌లో తన జట్టు తరఫున మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగనున్న అతను, జట్టు స్కోరును వేగవంతం చేసే కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నాడు.
