అరెరే..! ఆరుగురు పిల్లల తండ్రితో ముగ్గురు పిల్లల తల్లి ప్రేమాయణం..! “రహస్యంగా పెళ్లి”.. గ్రామంలో రచ్చకెక్కిన పంచాయితీ.. చివర్లో ఊహించని ట్విస్ట్..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భర్తను కోల్పోయిన ముగ్గురు పిల్లల తల్లి తబస్సుమ్, ఆరుగురు పిల్లల తండ్రి అయిన మహ్మద్ ఉమర్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.

మొరాదాబాద్ జిల్లా రాణీనాగల్ గ్రామానికి చెందిన తబస్సుమ్ భర్త రియాజుల్ దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి అత్తమామల ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం వాహనాల మెకానిక్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఉమర్‌తో తబస్సుమ్‌కు పరిచయం ఏర్పడింది. అతనికి అంతకుముందే వివాహమై ఆరుగురు పిల్లలు ఉన్నారు. క్రమంగా వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

కుటుంబ సభ్యులకు తెలియకుండా వీరిద్దరూ రహస్యంగా ‘నిఖా’ చేసుకోవడమే కాకుండా, కోర్టు వివాహానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ పెళ్లి విషయం తెలియడంతో తబస్సుమ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థుల్లో తీవ్ర కలకలం రేగింది.

ఈ వివాదం ముదరడంతో గ్రామ ప్రధాన్ జాహిద్ హుస్సేన్, స్థానిక పెద్దల సమక్షంలో అత్యవసర పంచాయితీ నిర్వహించారు. ఆ పంచాయితీలో తాము ఇష్టపూర్వకంగానే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని తబస్సుమ్, మహ్మద్ ఉమర్ ఇద్దరూ కుండబద్దలు కొట్టారు. ఇరువైపులా వారి అభిప్రాయాలను విన్న పంచాయితీ పెద్దలు, వారు కలిసి జీవించడానికి అనుమతినిచ్చారు.

దీంతో తబస్సుమ్ తన పిల్లలతో కలిసి మహ్మద్ ఉమర్ ఇంటికి వెళ్లిపోయింది. మరోవైపు, తాము తబస్సుమ్‌ను ఎంతో బాగా చూసుకున్నామని, అయితే ఆమె తన సొంత ఇష్టంతోనే వెళ్లినందున తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె మరిది పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు, బాధ్యతలు ఉండవని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. మొరాదాబాద్ గ్రామంలో జరిగిన ఈ వింత వివాహం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.


Posted

in

by

Tags: