ఇదేం పాకిస్తాన్ స్టైల్ ఇంగ్లీష్ రా బాబూ..? “ఈ స్థానంలో బాబర్ ఆజం ఉండాల్సింది”.. నెటిజన్లను ఆశ్చర్యపరిచిన పాక్ కెప్టెన్.. ఏకంగా ఇరగదీసేశాడుగా.. ..!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం గాయం కారణంగా బరిలోకి దిగలేదు.

దీంతో అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సల్మాన్ అలీ ఆఘా.. మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్లు మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్లలో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తడబడటం, తప్పులు దొర్లడం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడం సహజం. గతంలో సల్మాన్ ఆఘా కూడా తన ఇంగ్లీష్ సంభాషణల కారణంగా పలుమార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు.

అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఆయన ప్రదర్శించిన ధారాళత, ఆత్మవిశ్వాసం చూసి క్రికెట్ అభిమానులు నోరెళ్లబెట్టారు. ప్రజెంటర్ మార్క్ బుచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. జట్టు ఎంపిక, వ్యూహాలు మరియు సిరీస్‌ను ఎదుర్కొనే తీరుపై ఎలాంటి తడబాటు లేకుండా ఎంతో స్పష్టంగా, ధైర్యంగా ఇంగ్లీష్‌లో మాట్లాడారు.

ఈ ఇంటర్వ్యూ ప్రసారమైన కొద్ది నిమిషాల్లోనే దానికి సంబంధించిన వీడియో క్లిప్‌లు నెట్టింట దావానలంలా వ్యాపించాయి. దీన్ని చూసిన నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని, ఫన్నీ కామెంట్లను పంచుకుంటున్నారు.

“సల్మాన్ అలీ ఆఘా ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఇది పాకిస్తానీ ఇంగ్లీషేనా? మేము బాబర్ ఆజం స్టైల్ ఇంగ్లీష్‌ను మిస్ అవుతున్నాం” అంటూ ఒక యూజర్ సరదాగా కామెంట్ చేయగా.. “అతని ఇంగ్లీష్ మునుపటి కంటే చాలా మెరుగైంది” అంటూ మరొకరు ప్రశంసించారు. అకస్మాత్తుగా వచ్చిన కెప్టెన్సీ బాధ్యతను, మీడియా ఒత్తిడిని ఆయన డీల్ చేసిన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: