అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఒక ఉన్నత పాఠశాలలో, 37 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకుంటున్న 17 ఏళ్ల మైనర్ విద్యార్థితో క్లాస్‌రూమ్‌లోనే లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
హీథర్ మాష్బర్న్-స్మిత్ అనే ఆ ఉపాధ్యాయురాలు, తన తరగతికి చెందిన ఆ మైనర్ బాలుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆమెపై కేసు నమోదు కావడమే కాకుండా, పాఠశాల యాజమాన్యం ఆమెను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసింది.
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ‘స్నాప్‌చాట్’ (Snapchat) సోషల్ మీడియా యాప్ ద్వారా ప్రారంభమైంది. మొదట్లో సాధారణ సందేశాలతో మొదలైన వీరి పరిచయం, రానురానూ హద్దులు దాటింది. పోలీసుల విచారణలో.. క్లాస్రూమ్ లోపలే విద్యార్థితో పలుమార్లు శారీరకంగా గడిపినట్లు, ఆ తర్వాత ఆధారాలు దొరకకుండా బెంచీలు, నేలను రసాయన ద్రావణాలతో శుభ్రం చేసినట్లు ఆ టీచర్ ఒప్పుకుంది. అంతేకాకుండా, ఆ విద్యార్థికి 18 ఏళ్లు నిండి మేజర్ కాగానే తన భర్తకు విడాకులిచ్చి, అతనితో కలిసి జీవించాలని పథకం వేసినట్లు కూడా ఆమె విచారణలో వెల్లడించింది.
ఈ దారుణ ఘటనపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. మైనర్లతో అక్రమ లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన నేరం కింద ఆమెపై కఠిన చట్టాలతో కేసులు నమోదు చేశారు. న్యాయస్థానంలో ఈ నేరాలు రుజువైతే, ఆ ఉపాధ్యాయురాలికి గరిష్టంగా 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply