ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్-ఇన్స్పెక్టర్, ప్రతిరోజూ బైక్‌పై పోలీస్ చౌకీకి వెళ్లే క్రమంలో ఓ కాలేజీ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు.
రానురానూ ఆమెకు రోజూ బైక్‌పై లిఫ్ట్ ఇవ్వడం మొదలుపెట్టి, ప్రేమ పేరుతో ఆమెను బుట్టలో పడేశాడు. “నిన్నే పెళ్లి చేసుకుంటా” అని నమ్మబలికి ప్రమాణాలు చేసి, ఆమెను పలు హోటళ్లకు తీసుకెళ్లి తన శారీరక వాంఛలను తీర్చుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ విద్యార్థినిపై మోజు తీరడంతో, సదరు ఎస్సై ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి మాట్లాడటం పూర్తిగా మానేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని ఆ అధికారిపై సెక్షన్ 376 (అత్యాచారం) కింద ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ సబ్-ఇన్స్పెక్టర్ను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిత్యం ప్రేయసికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ఆ పోలీస్ అధికారిని, ఇప్పుడు కటకటాల్లోకి పంపించేందుకు తోటి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply