“నేనెందుకు ఆ బాధ్యత తీసుకోవాలి..?” వరుడి ఒకే ఒక్క కండిషన్.. పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకున్న యువతి.. వైరల్ అవుతున్న పోస్ట్..!!

పెళ్లయిన తర్వాత తన వృద్ధురాలైన తల్లిని తమతో పాటే ఉంచుకుంటానని కాబోయే భర్త చెప్పడంతో, ఒక యువతి ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా @miacluv అనే యూజర్ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని పంచుకోవడంతో ఈ చర్చ మొదలైంది.

తన తల్లిని చూసుకోవడంలో ఆ వ్యక్తికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఆ బాధ్యతను తనపై బలవంతంగా రుద్దాలని చూడటాన్నే తాను వ్యతిరేకించానని ఆ యువతి వివరించింది. అయితే, తన నిర్ణయాన్ని చూసి ఆ వ్యక్తి తనను “స్వార్థపరురాలు” అని నిందించినట్లు ఆమె పేర్కొంది.

ముందుగా మాట్లాడుకోకుండా, అంగీకరించకుండా పెళ్లయిన తర్వాత ఇలాంటి కొత్త బాధ్యతలను ఆకస్మికంగా నెత్తిమీద వేయడం ఏమాత్రం న్యాయం కాదని ఆమె వాదించింది. అంతేకాకుండా, “తల్లిని బాగా చూసుకునే ప్రతి ‘మంచి కొడుకు’ ఖచ్చితంగా ఒక మంచి భర్త కాలేడు” అని కూడా ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. వృద్ధురాలైన తల్లిని ఒక భారంగా, బాధ్యతగా చూడటం సరైంది కాదని, పెళ్లి అంటే అసలు అర్థమే ఆమెకు తెలియలేదని విమర్శించారు.

మరికొందరు వ్యక్తిగత హద్దుల (Personal Boundaries) ప్రాముఖ్యతను సమర్థించినప్పటికీ, కన్నతల్లిని ‘భరించలేని బాధ్యత’ అని ఆ యువతి మాట్లాడిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో వాడివేడి చర్చ నడుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *