సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికరమైన పోస్ట్‌లో, టెంట్ హౌస్ సంస్థలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న గుడ్డూ అనే యువకుడి ప్రేమకథ విపరీతంగా వైరల్ అవుతోంది.
టెంట్ హౌస్ యజమాని ఇంటికి పని నిమిత్తం తరచూ వెళ్లి వస్తుండే గుడ్డూకు, అక్కడ ఆ యజమాని కుమార్తె మహక్తో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. హోదాలు, ఆడంబరాలు, అంతస్తుల తేడాలను ఏమాత్రం పట్టించుకోకుండా, స్వచ్ఛమైన ప్రేమతో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ నూతన దంపతుల వివాహానికి సంబంధించిన వివరాలు, ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ శుభాకాంక్షల వెల్లువను అందుకుంటున్నాయి.

Leave a Reply