“65 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకో..!” నిద్రిస్తున్న యువతిపై మరిగే నీళ్లు పోసి.. చికిత్స కూడా అందించకుండా చిత్రహింసలు పెట్టిన కుటుంబం.. దేవుడిలా వచ్చి కాపాడిన మేనమామ.. వెలుగులోకి భయానక నిజాలు..!!

ప్రీతి (22) అనే యువతిని, ఆమె కుటుంబ సభ్యులు రూ. 3 లక్షల డబ్బు ఆశతో 65 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి బలవంతపు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే, ఈ పెళ్లి ప్రతిపాదనను ప్రీతి తీవ్రంగా వ్యతిరేకించింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు, రాత్రి వేళ ప్రీతి గాఢ నిద్రలో ఉండగా ఆమెపై మరిగే నీళ్లను పోసి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా, ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వరకు కనీస వైద్య చికిత్స కూడా అందించకుండా ఆమెను ఇంట్లోనే నిర్బంధించి తాళం వేశారు.

పక్కింటి మహిళ ఒకరు ఈ దారుణం గురించి ప్రీతి మేనమామకు సమాచారం అందించడంతో, ఆయన వెంటనే పోలీసుల సహాయంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఆమెను కాపాడారు. తీవ్రంగా గాయపడిన ప్రీతిని ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగం (ICU)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మానవత్వాన్ని మంటగలిపే ఈ పైశాచిక చర్యకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *