రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా (ASO) పనిచేస్తున్న నాజియా ఖానమ్ (30) అనే మహిళ, ఆగస్టు 21న ద్వారకలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణి కావడం గమనార్హం.
మృతురాలి భర్త, అత్తింటివారు ఆమెను గత కొంతకాలంగా తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తూ చిత్రహింసలు పెట్టేవారని నాజియా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపుల వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 85, 108 కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply