కర్ణాటక రాష్ట్రం మండ్య ప్రాంతంలో, మసీదు సమీపంలో ఎన్నో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఒక వృద్ధురాలు ఇటీవల మరణించారు.
ఆమె మరణానంతరం, మసీదు నిర్వాహకులు ఆమె నివసించిన ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ఇల్లంతా మూటలు మూటలుగా కరెన్సీ నోట్ల కట్టలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ నగదును లెక్కించి చూడగా దాని విలువ రూ. 1 కోటికి పైగానే ఉంటుందని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.
భర్త, పిల్లలు లేని ఆ వృద్ధురాలి సోదరులను సంప్రదించగా.. “ఈ దాచుకున్న డబ్బు మాకేమీ వద్దు, దీన్ని ఆ మసీదుకే విరాళంగా ఇచ్చేయండి” అని వారు నిస్వార్థంగా తేల్చి చెప్పారు. జీవితాంతం పేదరికంలో భిక్షాటన చేస్తూ గడిపిన ఓ వృద్ధురాలు, కోట్ల రూపాయల సంపదను కూడబెట్టి మరణించిన ఈ వింత ఘటన స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసింది.

Leave a Reply