పగలు ప్రియుడు, రాత్రి భర్త..! “నాకు ఒకేసారి ఇద్దరు మొగుళ్లూ కావాలి”.. పోలీస్ స్టేషన్‌లో మొండికేసిన ఇల్లాలు.. ఇద్దరు పిల్లల ముందే వింత రచ్చ!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాకు చెందిన శుభమ్ వర్మకు అంజు అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన నితిన్ అనే యువకుడితో అంజుకు పరిచయం ఏర్పడింది.

కొద్దిరోజులకే ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంట్లో లేని సమయంలో నితిన్ తరచూ ఇంటికి వచ్చి ఏకాంతంగా గడపడం శుభమ్ దృష్టికి రావడంతో, అతడు తన భార్యను తీవ్రంగా హెచ్చరించాడు.

అయినప్పటికీ భర్త మాటను ఏమాత్రం లెక్కచేయని అంజు, ప్రియుడిని ఇంటికి రప్పించడం కొనసాగించింది. దీంతో కుటుంబంలో తీవ్ర గొడవలు చెలరేగి, బంధువులు కూడా ఆమె తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇక లాభం లేదనుకున్న భర్త శుభమ్ ఈ వ్యవహారంపై నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భర్త, భార్య, ప్రియుడు ముగ్గురినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ప్రారంభించారు.

ఆ సమయంలో భర్త శుభమ్ పోలీసులతో మాట్లాడుతూ.. “నా భార్య నాతోనైనా ఉండాలి, లేదా ఆమె ప్రియుడితోనైనా వెళ్లిపోవాలి. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండటం నావల్ల కాదు. అవసరమైతే నేనే ఇల్లు వదిలి వెళ్లిపోతాను” అని స్పష్టం చేశాడు. కానీ భార్య అంజు మాత్రం తన వింత డిమాండ్‌పై మొండికేసి కూర్చుంది. “నాకు భర్త కావాలి, అటు ప్రియుడూ కావాలి. ఇద్దరితోనూ ఒకే ఇంట్లో కలిసి జీవించాలని అనుకుంటున్నాను” అంటూ భీష్మించుకు కూర్చుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *