కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ 6వ ఫేజ్ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
అక్కడున్న పంచవటి (పంచమతి) అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. మృతురాలిని సీతా పురుషోత్తం (30)గా గుర్తించారు. ఆమె గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో (డిప్రెషన్) బాధపడుతోందని, అందుకోసం వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply