ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లా ఖైర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్ కోర్టు ప్రాంగణంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ వివాధానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది.
ఆ సమయంలో ఇరువర్గాల మధ్య కోర్టు ప్రాంగణం వెలుపల ఒక్కసారిగా వాగ్వాదం జరిగి, అది పెద్ద ఘర్షణగా మారింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోడలు, తన అత్తను నేలపై తోసేసి దాడి చేసింది. అంతేకాకుండా బావమరిది, మామ, భర్త ఇలా ఇరు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకుంటూ కోర్టు ప్రాంగణాన్నే యుద్ధరంగంగా మార్చేశారు. ఈ క్రూరమైన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తీవ్ర సంచలనం సృష్టించడంతో, ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను అలీగఢ్ జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశించింది.

Leave a Reply