అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పెన్సకోలా ప్రాంతంలో ఉన్న వాల్మార్ట్ (Walmart) సూపర్ మార్కెట్ ఎప్పుడూ కస్టమర్ల రద్దీతో సందడిగా ఉంటుంది.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో, 43 ఏళ్ల మహిళ ఆ సూపర్ మార్కెట్లో వస్తువులను కొనుగోలు చేస్తోంది. ఆ సమయంలో నలుపు రంగు స్వెట్షర్ట్, బూడిద రంగు ప్యాంటు ధరించిన ఒక యువకుడు.. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి తననే వెంబడిస్తుండటాన్ని ఆమె గమనించింది. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కాస్త అప్రమత్తమైంది.
అతను తన చేతులను ప్యాంటు లోపల పెట్టుకుని విచిత్రంగా ప్రవర్తిస్తూ తన వెనుకే తిరుగుతున్నట్లు బాధిత మహిళ అనంతరం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.
ఈ క్రమంలో, ఒక వస్తువును చూసేందుకు ఆ మహిళ కిందకు వంగిన సమయాన్ని ఆ యువకుడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా ఆమె వెనుకకు వేగంగా వెళ్లి, తన ప్రైవేట్ భాగాలను బహిర్గతం చేస్తూ అత్యంత అసహ్యకరమైన చర్యకు (లైంగిక దాడికి) పాల్పడి అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు.
కొద్దిసేపటి తర్వాత నిలబడిన ఆ మహిళ.. తన బట్టలపై గుర్తుతెలియని ద్రవం ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ఆమె సూపర్ మార్కెట్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు పోలీసులను పిలిపించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం ఆమె దుస్తులపై ఉన్నది వీర్యం అని నిర్ధారణ అయింది. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. మరుసటి రోజే డ్వేన్ వాట్సన్ (Dwayne Watson) అనే 18 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడిపై బహిరంగంగా అసభ్య ప్రవర్తన, లైంగిక దాడి తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఎస్కాంబియా కౌంటీ జైలులో రిమాండ్లో ఉన్న అతనికి 10,000 డాలర్ల బెయిల్ బాండ్ విధించారు; ఆగస్టు 31న అతడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

Leave a Reply