రికమండేషన్ ఉంటేనే వైద్యం చేస్తారా..? “3 రోజులుగా ఐసీయూ బెడ్ దొరకక ప్రాణం పోయింది..” ఆసుపత్రిలో కన్నీరుమున్నీరైన సోదరి.. వైరల్ వీడియో!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) ట్రామా సెంటర్ ఆసుపత్రిలో, అత్యవసర పరిస్థితిలో చేరిన ఒక యువకుడికి గత 3 రోజులుగా ఐసీయూ (ICU) బెడ్ కేటాయించలేదని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

సకాలంలో సరైన ఐసీయూ వైద్యం అందకపోవడంతో ఆ యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సోదరుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన సోదరి.. ఆసుపత్రి ప్రాంగణంలోనే గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర కలకలం రేపాయి.

ఆ ఆసుపత్రిలో పలుకుబడి, రికమండేషన్ లేదా చేతినిండా డబ్బు ఉంటేనే వెంటనే ఐసీయూ బెడ్లు కేటాయిస్తున్నారని, సాధారణ, పేద రోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *