అయ్యో దేవుడా.. ఐదు రోజులుగా నరకయాతన.. గొలుసులతో చేతులు, కాళ్లు, మెడను కట్టేసి దారుణం.. ప్రాణభయంతో అల్లాడిన యువతి సురక్షితంగా రెస్క్యూ…!

బ్రెజిల్‌లోని ఆగువాస్ లిండాస్ డి గోయాస్ (Águas Lindas de Goiás) నగరంలో, ఆగస్టు 21న ఎమిలియన్ తమారా నూన్స్ కార్వాల్హో (24) అనే యువతిని పోలీసులు అత్యంత నాటకీయంగా రక్షించారు.

ఆమె మాజీ భర్త అయిన ఐల్టన్ రోడ్రిగ్స్ మెండిస్ ఆమెను ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. తమ ఇద్దరు పిల్లల విషయమై మాట్లాడేందుకు మాజీ భర్తను కలిసిన ఆ యువతి.. ఆగస్టు 17న అకస్మాత్తుగా అదృశ్యమైంది.

ఒక అద్దె ఇంట్లోని మంచంపై పడి ఉన్న ఆమెను పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె చేతులు, కాళ్లు మరియు మెడను ఇనుప గొలుసులు, తాళ్లు, సంకెళ్లతో బిగించి కట్టేసి ఉంచారు. అంతేకాకుండా, ఆమె అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి, శ్వాస సరిగా ఆడకుండా చేసే ముసుగును (మాస్క్) బలవంతంగా తొడిగారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అక్కడికి ఎత్తుకొచ్చినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

యువతిని రక్షించిన రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉండగా.. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, అత్యాచారం తదితర తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *