బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన సోనమ్ ఖాటూన్ అనే ముస్లిం యువతి.. తన ప్రియుడైన సంజీవ్ కుమార్‌ను వివాహం చేసుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పరిధి మదీనాథ్ ప్రాంతంలో ఉన్న అగస్త్య ముని ఆశ్రమంలో ఆచార్య పండిట్ కె.కె. శంఖధర్ నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణలు, హోమ పూజలు, సంప్రదాయ ఆచారాల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది.
శుద్ధి కార్యక్రమాల అనంతరం సోనమ్ ఖాటూన్ తన పేరును ‘సోనమ్ దేవి’గా మార్చుకుంది. వివాహ క్రతువు పూర్తయ్యాక వధూవరులిద్దరూ పూలమాలలు మార్చుకుని, పెద్దల ఆశీర్వాదం తీసుకుని తమ నూతన దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply