మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పరిధి కావ్డియా డోంగర్ ప్రాంతంలో కునాల్ చంద్‌గుడే మరియు ఆయన తల్లిదండ్రులు మృతి చెందిన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ క్రమంలో వారు ఎంతో గారాబంగా పెంచుకున్న ‘షేరు’ అనే పెంపుడు కుక్క, కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో రోజంతా ఇంటి లోపలే బంధీగా ఉండిపోయింది. పోలీసులు దర్యాప్తు కోసం ఇంటి తలుపులు తెరిచేంత వరకు ఆ మూగజీవి తలుపు వద్దే కూర్చుని దీనంగా రోదిస్తూ, మొరుగుతూ ఎదురుచూసింది.
అనంతరం ఆదివారం నాడు కునాల్ తాత (తల్లి తరఫు) బాబన్‌రావ్ కపుడే.. షేరును ఔరంగాబాద్ పెట్ కేర్ (జంతు సంరక్షణ) సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ దానికి అవసరమైన సంరక్షణ, చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా మరణించినప్పటికీ ఆ పెంపుడు కుక్క చూపించిన విశ్వాసం, అంతులేని ప్రేమ స్థానికులను ఎంతగానో కదిలించివేసింది.

Leave a Reply