“సార్.. నన్ను క్షమించండి!” రైలు వాష్‌రూమ్ పైపులు మాయం చేసిన చోరుడు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ షాకింగ్ ఘటన!

ముజఫర్‌పూర్ – హడప్సర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్ని వాష్‌రూమ్‌లలో నీళ్లు వృథాగా కారిపోతున్నాయని, అక్కడ ఉండాల్సిన పైపులు (ట్యాప్‌లు) మాయమయ్యాయని రైల్వే సిబ్బందికి సమాచారం అందింది.

వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలుకు నీటి సరఫరాను నిలిపివేసి, ప్రయాణికులను ఆరా తీయడం ప్రారంభించారు.

ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని సిబ్బంది అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఉన్న మరో ప్లాస్టిక్ కవర్‌లో ఒకటో రెండో కాదు.. ఏకంగా ఆ రైలు బోగీల్లోని అన్ని వాష్‌రూమ్‌ల నుంచి చోరీ చేసిన పైపులు, ట్యాప్‌ల సెట్ మొత్తం బయటపడింది.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆ దొంగకు ఏం చేయాలో పాలుపోలేదు. ప్రాణభయంతో వణికిపోతూ, ప్రయాణికులు, సిబ్బంది ముందే మోకాళ్లపై కూర్చుని.. “నన్ను క్షమించండి” అంటూ కన్నీరుమున్నీరై వేడుకున్నాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *