“స్కూటీపై వచ్చిన ఆ యువతి ఎవరు?”: ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న 4 ఏళ్ల చిన్నారికి ఘోరం.. వణికించిన అర్ధరాత్రి కిడ్నాప్.!!

విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి వేళ ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది.

విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, ఆయన భార్య సయ్యద్ శేషమ్మ దుకాణాలకు ధూపం వేస్తూ రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరు మూడు రోజుల క్రితం ఉపాధి కోసం విశాఖపట్నం వచ్చారు. రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై తమ చిన్నారితో కలిసి నిద్రిస్తుండగా.. ఒక యువతి, యువకుడు కలిసి ఈ దారుణ కిడ్నాప్‌కు పాల్పడ్డారు.

ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) కెమెరా దృశ్యాలను పరిశీలించారు. అందులో ఎస్.రాయవరం ప్రాంతానికి చెందిన ప్రతిభ, గరివిడి ప్రాంతానికి చెందిన ఉపేంద్ర అనే ఇద్దరు స్కూటీపై వచ్చి అర్ధరాత్రి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ కీలక సీసీటీవీ ఆధారాల మేరకు కిడ్నాప్‌కు పాల్పడిన ఆ ఇద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *