“ఇది నా బిడ్డేనా..?”: ప్రియుడు అడిగిన ఒక్క ప్రశ్న.. పురుషాంగాన్ని కోసేసిన కిరాతక ప్రియురాలు.. పోలీసుల ఎదుట విస్తుపోయే వాంగ్మూలం.!!

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఉన్న ఒక హోటల్‌లో, డస్టిన్ నోల్స్ (38) అనే వ్యక్తి పాశవికంగా హత్యకు గురైన కేసులో అతని ప్రియురాలు షెన్డింగ్ గువో (34)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గత మే 2024లో జరిగిన ఈ ఘటనలో.. నోల్స్‌ను కత్తితో పొడిచి, అతని శరీరాన్ని ఛిద్రం చేసి హతమార్చినట్లు గువోపై అభియోగాలు నమోదయ్యాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది, నోల్స్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

ఈ కిరాతక హత్యకు వారిద్దరి మధ్య గర్భం విషయంలో తలెత్తిన వాగ్వాదమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాను గర్భవతినని, ఆ కడుపులోని బిడ్డకు నోల్సే తండ్రి అని గువో చెప్పగా.. దానిని అంగీకరించేందుకు నోల్స్ నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గువో, అతని కాలుపై కత్తితో పొడిచింది. ఆ తర్వాత నోల్స్ స్పృహతప్పినట్లు నటిస్తున్నాడా లేదా అని పరీక్షించేందుకు.. అతని పురుషాంగాన్ని కోసేసి చెత్తబుట్టలో పడేసింది. అంతటితో ఆగకుండా, బయటకు వెళ్లి కొన్ని మందులు కొనుగోలు చేసి తెచ్చి అతనికి ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

గువో చేసిన ఆ ప్రథమ చికిత్స ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో నోల్స్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం మేసా కౌంటీ జైలులో రిమాండ్‌లో ఉన్న గువోపై.. తీవ్ర నిర్లక్ష్యంతో మరణం కలిగించడం, మృతదేహాన్ని అగౌరవపరచడం, తీవ్రంగా గాయపరచడం తదితర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన ప్రియుడిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని, తీవ్ర కోపోద్రేకాలతోనే ఈ దాడికి పాల్పడ్డానని ఆమె పేర్కొనగా.. నిందితురాలికి మానసిక వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *