ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోమతీ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న దివ్య మిశ్రా (37) అనే మహిళను.. ఆమె భర్త, తోటి బ్యాంకు ఉద్యోగి అయిన మనస్ మిశ్రా బ్యాంకు బయటకు పిలిపించి తుపాకీతో కాల్చి చంపాడు.
భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం చోటుచేసుకుంది.
భార్యను కాల్చి చంపిన అనంతరం అక్కడి నుంచి పరారైన మనస్ మిశ్రా.. హజారియా ప్రాంతానికి వెళ్లి తన సొంత సోదరి షీభాను కూడా తుపాకీతో కాల్చి హతమార్చాడు. ఆ తర్వాత మనస్ మిశ్రా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply