కృష్ణగిరి జిల్లా తళి సమీపంలోని గుమ్లాపురం గ్రామానికి చెందిన నారాయణస్వామి, విద్యా దంపతులకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, విద్యకు అదే ప్రాంతానికి చెందిన పునీత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీనిని నారాయణస్వామి పలుమార్లు హెచ్చరించినప్పటికీ విద్య తన పద్ధతిని మార్చుకోకపోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ క్రమంలో విద్య తన పేరున ఉన్న 8 సెంట్ల స్థలంలో 1,500 చదరపు అడుగుల స్థలాన్ని రూ.22 లక్షలకు విక్రయించి, ఆ డబ్బుతో ప్రియుడు పునీత్‌తో కలిసి కర్ణాటకలోని అనేపాల్ ప్రాంతానికి పారిపోయి తలదాచుకుంది. కాగా, గుమ్లాపురంలోని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేందుకు విద్య వచ్చినట్లు తెలుసుకున్న నారాయణస్వామి అక్కడికి చేరుకుని… స్థలం అమ్మగా వచ్చిన డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం వారి పేరిట డిపాజిట్ చేయాలని ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
అనంతరం విద్యను బ్యాంకు బయటకు తీసుకొచ్చిన సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నారాయణస్వామి, కింద పడి ఉన్న బండరాయితో ఆమె తలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో విద్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న తళి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భార్యను హత్య చేసి పరారైన నారాయణస్వామిని అరెస్ట్ చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply