మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ అధికారితో జరిగిన గొడవ సమయంలో మహిళ భుజాన్ని పట్టుకుని తోసిన వివాగానికి సంబంధించి ముంబై హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది.
లైంగిక ఉద్దేశ్యం లేనప్పుడు, ఒక మహిళ భుజాన్ని పట్టుకుని తోసే చర్య ఆటోమేటిక్‌గా లైంగిక వేధింపులు (Sexual Harassment) కాదని కోర్టు స్పష్టం చేసింది.
అదெలా అంటే మహారాష్ట్రలోని ఒక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (BDO) ఒకరు పనిచేస్తున్నారు. ఆ కార్యాలయంలోకి ప్రవేశించిన గిరీష్ నిగొండా పాటిల్ అనే వ్యక్తి, అక్కడ మహిళా అధికారితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
ఆ సమయంలో ఆఫీస్ డాక్యుమెంట్లను చింపేయడంతో పాటు, ఆ మహిళ కుడి భుజాన్ని పట్టుకుని గట్టిగా తోసాడు. దీనివల్ల తనకు అవమానం, అసౌకర్యం కలిగిందని ఆ మహిళా అధికారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్ మరియు అక్కడ ఉన్న మరొకరి సాక్ష్యాలు కూడా ఈ సంభవనాన్ని ధృవీకరించాయి. దీని ఆధారంగా ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి.
ఈ కేసును విచారించిన జస్టిస్ అభయ్ మంద్రి నేతృత్వంలోని సింగిల్ బెంచ్, ఇది కేవలం ఆఫీస్ పని నిమిత్తం జరిగిన గొడవ కారణంగానే జరిగిందని పేర్కొంది. ఇందులో స్పష్టమైన లైంగిక ఉద్దేశం గానీ లేదా లైంగిక పరమైన చేష్టలు గానీ లేవని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 354A అనేది కేవలం లైంగిక స్పర్శలు, లైంగిక అనుకూలతలను కోరడం లేదా లైంగిక వ్యాఖ్యలను మాత్రమే సూచిస్తుంది. అందువల్ల, ఇదొక అడ్మినిస్ట్రేటివ్ వివామం కాబట్టి లైంగిక వేధింపుల ఆరోపణ వర్తించదని కోర్టు తేల్చిచెప్పింది.
పబ్లిక్ సర్వెంట్‌ను వారి అధికారిక విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం మరియు శారీరక దాడికి సంబంధించిన ఆరోపణలు కొనసాగుతాయని కోర్టు ధృవీకరించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణ మరియు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలు కొట్టివేయబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగిని దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడం, గాయపరచడం మరియు మహిళను అవమానించే ఉద్దేశంతో హింసకు పాల్పడడం అనే సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది.

Leave a Reply