గోవా రాష్ట్రం పోర్వోరిమ్‌లోని ‘మజెస్టిక్ ప్రైడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్’ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్‌పై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.
రిసార్ట్ బయట తన సెక్యూరిటీ ఆఫీసర్‌తో కలిసి కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఈ దాడి సంఘటన చోటుచేసుకుంది.
ఈ దాడి సమయంలో శ్రీనివాస్ నాయక్ అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ ఎదురుకాల్పులు జరపడంతో, ఆ దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుండి పరారై జాతీయ రహదారి వైపు వెళ్లారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన నార్త్ గోవా ఎస్పీ హరీష్ మక్తాయ్కర్ నేతృత్వంలోని పోలీసులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాకుండా, నిందితులను గుర్తించడానికి మరియు వారి కదలికలను కనిపెట్టడానికి ఆ ప్రాంతంలోని, క్యాసినో పరిసరాలలోని సీసీటీవీ (కెమెరా దృశ్యాలను) పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

Leave a Reply