ఢిల్లీలో వెన్నులో వణుకు పుట్టించే దారుణం.. 47 కి.మీ ప్రయాణించిన బస్సులో పాఠశాల బాలికపై పైశాచికత్వం: హాహాకారాలు పెడుతున్నా కనికరించని డ్రైవర్, కండక్టర్..!

ఢిల్లీలో ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి ప్రాంతానికి చెందిన ఆ బాలికపై ఆగస్టు 4వ తేదీ రాత్రి కాశ్మీరీ గేట్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా తనిఖీలు చేయించారు. బస్సు నుంచి కీలకమైన శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, నిందితులకు కఠిన శిక్ష పడేలా సమగ్ర దర్యాప్తును వేగవంతం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *