చాలా అసహ్యంగా ఉంది..! “శ్మశానంలో కాలుతున్న శవం నుంచి మాంసాన్ని తీసి తిన్న మహిళా అఘోరీ”.. చూస్తేనే వాంతి వస్తోంది.. చనిపోయాక కూడా వదలరా..? కలకలం రేపుతున్న వీడియో!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలోని ఒక స్మశానవాటికలో, ఓ మహిళ కాలిన మానవ శరీర అవశేషాలను వెతికి తీసి తింటున్న దృశ్యాలకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.

ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను, కలకలాన్ని రేకెత్తించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒళ్లంతా విభూతి రాసుకుని, నల్లటి వస్త్రాలు ధరించిన ఒక మహిళ కనిపిస్తోంది. ‘కాళీ నంద్ గిరి’గా గుర్తించిన ఆ మహిళ, కాలుతున్న చితికి అతి సమీపంలోకి వెళ్లి, ఎముకలు మరియు పుర్రెలను వెతుకుతోంది.

అక్కడ కాలుతున్న శవం నుంచి వేడివేడి మాంసాన్ని చేతులతో బయటకు తీసి ఆమె తింటున్నట్లుగా దృశ్యాలు రికార్డయ్యాయి. అంతేకాకుండా, చేతిలో ఒక కత్తిని పట్టుకుని తిరుగుతూ.. “ఇదిగో చూడండి, ఇప్పుడే తీశాను. చాలా రుచిగా ఉంది. నాకు దూరంగా ఉండండి” అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడిన మాటలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.

వీడియోలో మరింతగా మాట్లాడిన ఆ మహిళ.. “భస్మం పూసుకోవడం, పుర్రెలతో ఆడుకోవడమే మా పని. ఇదే మా జీవన విధానం. మేము నరమాంసాన్ని ఇలాగే తింటాము. మీ ఊహకు కూడా అందని ఎన్నో పనులను మేము చేయగలం” అంటూ హెచ్చరికలు జారీ చేసింది. వీడియో చివర్లో ఆమె శ్మశానానికి సంబంధించిన కొన్ని మంత్రాలను కూడా ఉచ్చరించింది.

మరణించిన వారి శరీరాలను ఛిద్రం చేయడం, స్మశానవాటికలోని మానవ అవశేషాలను నాశనం చేయడం చట్టరీత్యా నేరం. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసుల నుంచి గానీ, జిల్లా యంత్రాంగం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ ఘటన నిజమైనదా లేక సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ప్లాన్ చేసి వైరల్ చేశారా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని స్థానిక ప్రజలతో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *