డాబ్రా సమీపంలోని పిచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదారియా పురా గ్రామంలో, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక ఘోర పరువు హత్య చోటుచేసుకుంది.
కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా, 21 ఏళ్ల నందిని యాదవ్ అలియాస్ అను అనే యువతిని ఆమె కన్నతండ్రి భగవాన్‌దాస్, మేనమామ సంతోష్ యాదవ్‌లు కనికరం లేకుండా గొంతు నులిమి హత్య చేశారు. స్థానిక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న నందిని, తన బట్టలు తీసుకునేందుకు ఇంటికి వచ్చిన సమయంలో.. అప్పటికే హత్య చేయాలనే కక్షతో అక్కడ వేచి చూస్తున్న వీరిద్దరూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
నందినిని చంపడమే కాకుండా, అక్కడే ఉన్న ఆమె మైనర్ చెల్లెలిని కూడా ఆ రాక్షసులు చంపడానికి ప్రయత్నించారు. ఇంట్లో జరిగిన తీవ్ర ఘర్షణ తర్వాతే తండ్రి, మేనమామ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాణాలతో బయటపడిన చెల్లెలు వాంగ్మూలం ఇచ్చింది. ఈ భయానక ఘటన అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు గురైన నందిని తల్లి, బంధువులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు నందిని అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కన్నవారే నిర్దాక్షిణ్యంగా చేసిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం, విషాదాన్ని రేకెత్తించింది.

Leave a Reply