పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలో ఉన్న జీజీఎస్ (GGS) ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఆగస్టు 27వ తేదీన ఒక దిగ్భ్రాంతికర కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.
అక్కడికి తన తల్లితో కలిసి వచ్చిన మూడేళ్ల బాలుడు, తల్లి మందులు తీసుకునేందుకు వెళ్లిన కాసేపట్లోనే ఒక గుర్తుతెలియని మహిళ చేతిలో అపహరణకు గురయ్యాడు. చిన్నారి కనిపించకపోవడంతో హతాశురాలైన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసును దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు, కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ కోసం ముమ్మరంగా గాలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ నిందితురాలిని.. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సాయంతో దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగా పోలీసులు వదలకుండా వెంబడించారు. చివరకు బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో ఆ మహిళను పోలీసులు అరెస్టు చేసి, చిన్నారిని ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా రక్షించారు.

Leave a Reply